బాహుబలిలా వెపన్‌ | Sakshi
Sakshi News home page

బాహుబలిలా వెపన్‌

Published Fri, May 31 2024 3:27 AM

WEAPON Movie Trailer Launch

‘‘ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదు. ‘బాహుబలి’ సినిమా ఎన్నో భాషల్లో విడుదలైంది. మా ‘వెపన్‌’ మూవీ కూడా అలాంటి చిత్రమే. సూపర్‌ హ్యూమన్‌ సాగా కాన్సెప్ట్‌తో రానున్న ఈ మూవీ కొత్త ట్రెండ్‌ కావడంతో పాటు పెద్ద హిట్టవుతుంది’’ అని నటుడు సత్యరాజ్‌ అన్నారు. గుహన్‌ సెన్నియప్పన్‌ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్‌ రవి, తాన్యా హోప్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్‌’.

ఎంఎస్‌ మన్జూర్‌ సమర్పణలో మిలియన్‌ స్టూడియో బ్యానర్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో గుహన్‌ సెన్నియప్పన్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక స్కైఫై థ్రిల్లర్, యాక్షన్‌ మూవీ’’ అన్నారు. ‘‘వెపన్‌’ లాంటి మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు వసంత్‌ రవి, తాన్యా హోప్, రాజీవ్‌ పిళ్లై.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement