
యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటిస్తోన్న తాజా చిత్రం ఫంకీ(FUNKY Teaser). ఈ మూవీకి జాతిరత్నాలు' సినిమాతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కయాద్ లోహర్ హీరోయిన్‌గా కనిపించనుంది.
తాజాగా రిలీజైన టీజర్ చూస్తే అనుదీప్ కామెడీ మార్క్ కనిపిస్తోంది. టీజర్ ప్రారంభంలో వచ్చే డైలాగ్‌తోనే నవ్వులు తెప్పించాడు. చిన్నప్పుడు మా అమ్మ మాటలు అస్సలు వినలేదు.. ఏం చెప్పారండి.. చెప్పాను కదా ఏం వినలేదని.. అంటూ నవ్వులు పూయించాడు. ఆ తర్వాత విశ్వక్ సేన్ పంచ్ డైలాగ్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. నేను ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూలే.. ఇక్కడ చదివాను కాబట్టే నాకు చదువుపై విరక్తి పుట్టింది.. అందుకే సినిమాల్లోకి వెళ్లా అంటూ విశ్వక్ సేన్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
కాగా.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వీకే నరేశ్, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.