ఇప్పుడీ ఫొటోలు అవసరమా? అనసూయ ఘాటు రిప్లై | Viral: Netizen Comments On Anchor Anasuya Latest Pics, See Her Reply | Sakshi
Sakshi News home page

చిన్నపిల్లలా మారిపోయిన అనసూయ: 'ఇప్పుడిది అవసరమా?'

Apr 23 2021 9:05 AM | Updated on Apr 23 2021 12:05 PM

Viral: Netizen Comments On Anchor Anasuya Latest Pics, See Her Reply - Sakshi

కరోనా వల్ల ప్రాణాలే పోతున్నాయి. దీని గురించి నీకు కాస్తైనా బాధేయడం లేదా? ఇలాంటి సమయంలో ఈ ఫొటోలు ఎలా పెట్టాలనిపిస్తుంది? అసలు ఇప్పుడీ ఫొటోలు పోస్ట్‌ చేయడం అంత అవసరమా?

అనసూయ భరద్వాజ్‌.. అందం, అభినయం.. రెండింటిలోనూ తనకు తానే సాటి. ఇక యాంకరింగ్‌లో ఈవిడ చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. ఎదుటివాళ్లకు పంచులు విసురుతూ, విమర్శించేవాళ్లకు కౌంటర్లు వేస్తూ దూకుడుగా వ్యవహరిస్తుంది అనసూయ. తాజాగా తను చిన్నపిల్లలా మారిపోయింది. కొన్నేళ్లు వెనక్కు వెళ్లిపోయినట్లు రెండు జడలు వేసుకుని పొట్టి బట్టల్లో దర్శనమిచ్చింది. నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడూ అలానే ఉన్నాను అంటూ ఈ పొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అయితే చాలామంది ఈ ఫొటోలు చూసి మండిపడ్డారు.

స్కూల్‌ బ్యాగ్‌ వేసుకోవడం మర్చిపోయినట్లుంది అంటూ సెటైర్లు వేశారు. ఒక వ్యక్తి అయితే.. కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. దీని గురించి నీకు కాస్తైనా బాధేయడం లేదా? ఇలాంటి సమయంలో ఈ ఫొటోలు ఎలా పెట్టాలనిపిస్తుంది? అసలు ఇప్పుడీ ఫొటోలు పోస్ట్‌ చేయడం అంత అవసరమా? అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇలాంటి విషమ పరిస్థితుల్లో కూడా జనాలకు కొంత వినోదం, మరికొంత నమ్మకాన్ని కలిగించడానికి మేం ప్రయత్నిస్తున్నాం అని బదులిచ్చింది.

దీంతో పలువురు ఆమ ఆన్సర్‌ను సమర్థిస్తుండగా కొంతమంది మాత్రం విబేధిస్తున్నారు. ఇక ఆమె సమాధానంతో సంతృప్తి చెందని సదరు నెటిజన్‌.. ఈ సమయంలో జనాలకు కావాల్సింది చేయూత తప్ప వినోదం కానే కాదు. ఓ పక్క వాళ్లు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ చచ్చిపోతుంటే వారిని ఇలా ఎంటర్‌టైన్‌ చేయడం కరెక్ట్‌ అని ఎలా సమర్థించుకుంటున్నావు? ఇది కరెక్ట్‌ కాదు అని చెప్పుకొచ్చాడు. దీంతో అనసూయ ఫ్యాన్స్‌ అతడిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మరి బయట పరిస్థితులు అంత దారుణంగా ఉంటే నువ్వెందుకు ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతున్నావు? ఎవరు ఏ పోస్ట్‌ పెట్టారు? అని ఎందుకు చూస్తున్నావు, నీకు పనీపాటా లేదా? అంటూ అతడిని గట్టిగానే నిలదీశారు.

చదవండి: సెల్ఫీ అన్నాడు.. ఏకంగా ముద్దే పెట్టేశాడు, ఆ నెక్స్ట్‌ కరోనా వచ్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement