‘నువ్వుంటే నా జతగా’.. అనుష్క, విరాట్‌ ఫోటో వైరల్‌

Viral: Anushka Sharma, Virat Kohli Enjoy A Magical Sunset In The Pool - Sakshi

ఇటు సినిమా.. ఇటు క్రికెట్‌ ప్రపచంలో అనుష్క-విరాట్‌ జంటకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూనే సమయం చిక్కినప్పుడల్లా ఇద్దరి కలిసి సరాదాగా గడుపుతుంటారు. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతి అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అనుష్క పండండి బిడ్డకు జన్మనివ్వనుంది. మొదటిసారి తల్లిదండ్రులు కాబోతుండటంతో ఆ ఆనందంలో ఉండే అనుభూతిని విరుష్క జంట ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్‌ 2020లో భాగంగా విరాట్‌ కోహ్లీ దుబాయ్‌లో ఉండగా ఆయన సతీమణి అనుష్క కూడా అక్కడే ఉన్నారు. చదవండి: రషీద్‌ ఖాన్‌ భార్య అనుష్క శర్మ!

ఇటు క్రికెట్‌ గ్రౌండ్‌లో పరుగులతో రెచ్చిపోతున్న విరాట్‌ మరోవైపు అర్ధాంగితో కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటో ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇందులో విరుష్క జంట సూర్యాస్తమ సమయంలో భుజాల వరకు నీటిలో మునిగి ఒకరి కళ్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ ఫోటోలో ఉన్న ప్రకృతి వారిద్దరికి మరింత అందాన్ని తెచ్చింది. దీనికి సంద్యా సమయానా ప్రేమతో.. అన్న అర్థం వచ్చేలా రెడ్‌ లవ్‌, సూర్యాస్తమం సింబల్‌ను జత చేశారు. ఈ ఫొటోకు ఉన్న మరో విశేషం ఏమిటంటే.. క్రికెటర్‌ ఏబీ డెవిలియర్స్‌ ఈ ఫొటోని తీయడం. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే క్యాప్షన్‌ రూపంలో తెలిపారు. కాగా ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది. విరుష్క కపూల్‌ చాలా అందంగా, చూడ ముచ్చటగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. చదవండి: విరాట్‌కు 'ఫ్లైయింగ్‌ కిస్‌' ఇచ్చిన అనుష్క

❤️🌅 pic credit - @abdevilliers17 😃

A post shared by Virat Kohli (@virat.kohli) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top