హత్యపై దర్శన్‌ కుమారుడు కామెంట్‌.. కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర | Actor Darshan Son Vineesh Thoogudeepa Reacts On His Father Arrest Incident, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

హత్యపై దర్శన్‌ కుమారుడు కామెంట్‌.. కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర

Published Fri, Jun 14 2024 9:33 AM | Last Updated on Fri, Jun 14 2024 10:01 AM

Vineesh Comments On His Father Darshan Incident

కన్నడ ప్రముఖ నటుడు దర్శన్‌ ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రియురాలు పవిత్రగౌడ కూడా అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె కారణంగానే ఈ హత్య జరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. పవిత్ర వల్లే తన అభిమాన హీరో జీవితం నాశనం అవుతుందని రేణుకాస్వామి భావించాడు. ఆమె వల్లే భార్యను దర్శన్‌ దూరం చేసుకున్నాడని భావించిన రేణుకాస్వామి పవిత్రకు రేణుకాస్వామి వార్నింగ్‌ మెసేజ్‌లు పెట్టినట్లు తెలుస్తోంది.

కన్నీళ్లు పెట్టుకున్న దర్శన్‌ ప్రియురాలు
పోలీసుల విచారణలో నటి పవిత్ర కన్నీరు పెట్టుకుంది. తను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చింది. 'చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి నాకు అసభ్య మెసేజ్‌లతో పాటు అశ్లీల చిత్రాలను పంపేవాడు. ఈ విషయాన్ని దర్శన్‌కు చెప్పి తప్పు చేశాను. ఒకవేళ రేణుకాస్వామి విషయాన్ని ముందుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింటే ఈ హత్య జరిగేది కాదు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

నా తండ్రిని దూషిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు: దర్శన్‌ కుమారుడు
రేణుకాస్వామి హత్యకేసులో అరెస్ట్‌ అయిన తన తండ్రి దర్శన్‌ గురించి 'వినీశ్‌ తూగుదీ' (15) ఒక పోస్ట్‌ పెట్టాడు. నా తండ్రి దర్శన్‌తో పాటు తల్లి విజయలక్ష్మికి మానసిక ప్రశాంతత అవసరం ఉంది. నా తండ్రిని భూతులతో దూషిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. నా తండ్రి హత్య చేసి ఉంటాడని నేను నమ్మడం లేదు. పోలీసుల దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయి. అంతవరకు కాస్త ఓపిక పట్టండి.' అని ఆవేదనతో దర్శన్‌ కుమారుడు వినీశ్‌ చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement