సూపర్‌ స్టార్‌ సినిమాలో విలక్షణ నటుడు.. మరోసారి విలన్‌గా! | Sakshi
Sakshi News home page

Rajinikanth: రజినీకాంత్‌ను మరోసారి ఢీ కొట్టనున్న కోలీవుడ్ స్టార్!

Published Mon, Jan 1 2024 6:40 PM

Vijay Sethupathi Will Acts As Negative Role In Super Star Movie - Sakshi

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ ప్రధాన పాత్రను పోషించిన లాల్‌ సలామ్‌. విష్ణువిశాల్‌, విక్రాంత్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇ‍ప్పటితే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నఈ చిత్రం పొంగల్‌కు విడుదల కానుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం రజనీకాంత్‌ తన 170వ చిత్రాన్ని జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో ఆయన మాజీ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పవర్‌పుల్‌ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి ఇప్పుటికే రజనీకాంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సన్‌ పిక్చర్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో నటుడు శివకార్తీకేయన్‌ ముఖ్య పాత్రలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. తాజాగా విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి నటించనున్నట్లు తెలుస్తోంది. 

కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎలాంటి పాత్రనైనా పోషిస్తూ తన స్థాయిని జాతీయ స్థాయికి పెంచుకుంటూ పోతున్న విజయ్ సేతుపతి.. ఆ మధ్య మాస్టర్‌ చిత్రంలో విజయ్‌తో ఢీకొట్టారు. ఆ తరువాత విక్రమ్‌ చిత్రంలో కమలహాసన్‌తో పోటీ పడ్డారు. అంతకు ముందే రజినీకాంత్‌తో పేట చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు.  తాజాగా విజయ్‌ సేతుపతి మరోసారి రజినీకాంత్‌కు ప్రతినాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్‌. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement