విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో ‘జననాయగన్‌’ | Vijay Jana Nayagan Illegally Aired On Local Cable Channel | Sakshi
Sakshi News home page

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో ‘జననాయగన్‌’

Apr 14 2026 12:42 PM | Updated on Apr 14 2026 12:49 PM

Vijay Jana Nayagan Illegally Aired On Local Cable Channel

తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్‌కు నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్‌’కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సుమారు ఐదు నిమిషాల నిడివి గల కీలక దృశ్యాలు, పాటలు ఇంటర్నెట్‌లో లీక్ కాగా, తాజాగా ఓ లోకల్‌ ఛానల్‌ ఏకంగా సినిమా మొత్తాన్ని ప్రసారం చేసింది. ఇంకా థియేటర్స్‌లో కూడా విడుదల కానీ ఈ సినిమా.. టీవీలో ప్రసారం చేయడం చిత్రబృందాన్ని షాక్‌కు గురి చేసింది.

కోయంబత్తూరు సమీపంలోని కరుమత్తంపట్టిలో ‘రాశి కేబుల్ టీవీ’ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న పళనిసామి అనే వ్యక్తి తన లోకల్ ఛానెల్‌లో ఏప్రిల్ 11 రాత్రి ఈ చిత్రాన్ని ప్రసారం చేశారు. ఇంకా థియేటర్స్‌లో విడుదల కాని సినిమా ఏకంగా టీవీలో ప్రసారం కావడాన్ని చూసి విజయ్‌ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు షాకయ్యారు. 

ఈ సినిమా ‍ప్రసారాన్ని నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పళనిసామిని అరెస్ట్ చేసి ప్రసారానికి వాడిన కంప్యూటర్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే సినిమా మొత్తం సదరు ఛానల్‌లో ప్రసారం అయిందని టీవీకే నేతలు చెబుతున్నారు. 

మరోవైపు ఈ సినిమా ఆన్‌లైన్‌ లీకేజీకి సంబధించిన కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement