కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీనీ స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవ్వగానే.. సతీమణి సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ విడాకుల కేసు నేడు (ఏప్రిల్ 20) చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని.. ఆన్‌లైన్ ద్వారా విచారణకు హాజరవుతానంటూ విజయ్ తన లాయర్‌తో పిటిషన్ దాఖలు చేయించాడు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
ఇదిలా ఉంటే.. విజయ్-సంగీత జంట పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం చెన్నైలో ఇరువురి లాయర్లు కలిసి చర్చలు జరిపారు. విడిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని..సెటిట్‌మెంట్ కింద సుమారు రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్‌మెంట్ ఇవ్వాలని సంగీత కోరుతుందట.
అయితే విజయ్ మాత్రం రూ.35 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కుమారుడు, కుమార్తెల బాగోగులు తాను చూసుకుంటానని అంటున్నాడట. అయితే ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కోర్టు విచారణలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.


