Vijay Deverakonda: బ్లాక్‌బస్టర్‌ గీత గోవిందం కాంబినేషన్‌ రిపీట్‌.. అధికారిక ప్రకటన..

Vijay Deverakonda Collaboration With Geeta Govindam Director Parasuram - Sakshi

‘గీతగోవిందం’ (2018) వంటి సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖుషి’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ కూడా మొదలైంది. అయితే సమంత అనారోగ్యం, కాల్షీట్స్‌ సర్దుబాటు కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. హేషామ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్నారు. అలాగే దర్శకుడు సుకుమార్‌తో విజయ్‌ దేవరకొండ ఓ సినిమాకి కమిట్‌ అయిన సంగతి తెలిసిందే.

చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా?

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top