సగం సినిమా పూర్తి.. సంక్రాంతి కానుకగా విడుదల | Vijay Deverakonda and Mrunal Thakur film gears up for Sankranti 2024 | Sakshi
Sakshi News home page

సగం సినిమా పూర్తి.. సంక్రాంతి కానుకగా విడుదల

Sep 28 2023 1:13 AM | Updated on Sep 28 2023 6:16 PM

Vijay Deverakonda and Mrunal Thakur film gears up for Sankranti 2024 - Sakshi

‘గీత గోవిందం’ వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ పరశురామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీడీ 13’ (వర్కింగ్‌ టైటిల్‌). మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న 54వ సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్‌ 50 శాతం పూర్తయింది.

ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలో టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తాం. 2024 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్, సంగీతం: గోపీసుందర్, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: వాసూ వర్మ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement