ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా? | Vijay Devarakonda's 'Family Star' Movie OTT Release Details | Sakshi
Sakshi News home page

Family Star OTT: ఆ రోజున ఓటీటీలోకి విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ?

Apr 14 2024 5:07 PM | Updated on Apr 14 2024 5:14 PM

Vijay Devarakonda The Family Star Movie OTT Release Details - Sakshi

విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అద్భుతమైన వీకెండ్, సెలవుల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.  ప్రస్తుతం అక్కడక్కడ థియేటర్లలో ఉన్న ఈ చిత్రానికి పెద్దగా జనాలు వెళ్లట్లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!)

'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' లాంటి మూవీస్ దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా ఫేమ్ అయిత్ వచ్చింది కానీ సరైన హిట్ ఒక్కటి పడటం లేదు. తాజాగా 'ఫ్యామిలీ స్టార్' కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికలపడిపోయింది.

ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. 45 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనుకుంది. కానీ ఇప్పుడు థియేటర్ రిజల్ట్ తేడా కొట్టేయడంతో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. మే 3 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చేయాలని అనుకుంటోందట. కుదిరితే ఇంకా ముందే కూడా వచ్చేయొచ్చు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఆ సినిమా వల్ల భారీగానే నష్టపోయాం: చిరంజీవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement