సీఎం విజయ్‌తో విజయ్ ఆంటోనీ, ఆర్జే బాలాజీ భేటీ | Vijay Antony, RJ Balaji meeting with CM Vijay | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌తో విజయ్ ఆంటోనీ, ఆర్జే బాలాజీ భేటీ

Jun 2 2026 11:47 PM | Updated on Jun 2 2026 11:55 PM

Vijay Antony, RJ Balaji meeting with CM Vijay

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను సినీ హీరో విజయ్‌ ఆంటోనీ, ఇటీవల హీరో సూర్యతో ‘కరుప్పు’ చిత్రం చేసి హిట్‌కొట్టిన దర్శకుడు ఆర్జే బాలాజీ మంగళవారం వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా తమ సీఎంతో తీసుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.  

విజయ్‌ ఆంటోనీ మాట్లాడుతూ.. సీఎం విజయ్‌తో గడిపిన సమయం ఎంతో ప్రేరణాత్మకంగా అనిపించింది. ఆయన పాజిటివిటీ, ఎనర్జీ ఎప్పటిలాగే అద్భుతంగా ఉన్నాయి. ప్రజలకు సేవ చేస్తూ సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి కావాల్సిన శక్తి ఆయనకు లభించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.  

ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. విజయ్‌ను ముఖ్యమంత్రిగా కలవడం నమ్మశక్యం కాని అనుభూతి. ఆయన చూపే ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉన్నారని అన్నారు.  

‘కరుప్పు’ కథను మొదట విజయ్‌కే చెప్పినట్టు బాలాజీ గతంలో వెల్లడించారు. అయితే విజయ్‌ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినిమా ఆలస్యమవుతుందన్న భావనతో సూర్యతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళనాట ఆ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైంది. తమిళనాడులో ఈ చిత్రాన్ని జనం ఎగబడి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.300 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఈ మూవీతో సూర్యకు హిట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement