విశ్వాస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సింగిల్ రాజు’. ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శక–నిర్మాత వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా హాజరై టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా కథ చాలా ఆసక్తిగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలి’’ అని తెలిపారు.
ఎస్.ఎస్. వర్మ మాట్లాడుతూ–‘‘అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమా కోసం నాకంటే ఎక్కువగా మా అమ్మానాన్నలు కష్టపడ్డారు. ప్రేక్షకులను అలరించే మంచి ఎంటర్‌టైనర్‌గా ‘సింగిల్ రాజు’ నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘వర్మ, మేము ఎంతో ప్యాషన్‌తో చేస్తున్న చిత్రమిది’’ అన్నారు విశ్వాస్. ఈ చిత్రానికి కెమెరా: సాయితేజ కుందారపు, నితీష్.


