ఈ ముహూర్తంలోనే వరుణ్‌- లావణ్యల పెళ్లి.. ఎందుకంటే? | Sakshi
Sakshi News home page

ఈ ముహూర్తంలోనే వరుణ్‌- లావణ్యల పెళ్లి.. ఎందుకంటే?

Published Tue, Oct 31 2023 6:23 PM

Varun Tej And Lavanya Tripathi Marriage Muhurtham - Sakshi

ఇటలీలో మెగా పెళ్లి సందడికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో కొణిదెల  వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు  ఏడు అడుగులు వేయబోతున్నారు. నవంబర్‌ 1న ఇరు కుటుంబాల సమక్షంలో  డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా-అల్లు కుటుంబాలు అక్కడ సందడి చేస్తుండగా.. సమంత,నాగ చైతన్య,రష్మిక మందన్న కూడా ఆ వేడుకల్లో భాగమైందుకు ఇటలీ వెళ్లినట్లు సమాచారం. కాక్‌టెయిల్ పార్టీతో వెడ్డింగ్ వేడుకలు నిన్నటి నుంచే గ్రాండ్​గా ప్రారంభమయ్యాయి.

(ఇదీ చదవండి:  కనీసం ఒక్కొక్కరు రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్‌ పోస్ట్‌ వైరల్‌)

ఈ రోజు హల్దీ, మెహందీ వేడుకలు కూడా ఘనంగా ప్రారంభం అయ్యాయి.  మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య త్రిపాఠి కుటుంబాలకు చెందిన స్నేహితులు దాదాపు 100 మందికి పైగా అతిథులు పెళ్లికి హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇక వీరి పెళ్లి ముహూర్తం రేపు నవంబర్ 1వ మధ్యాహ్నం 2:48కి  ఖరారు చేశారు. ఆ సమయంలో  లావణ్య మెడలో వరుణ్‌ తాళి కట్టనున్నారు. ఆ సమయం నుంచి వారిద్దరు భార్య భర్తలు కానున్నారు. వారిద్దరి జాతకాల ప్రకారం ఈ సమయాన్ని పురోహితులు నిశ్చయించారట..  జీవితాంతం సంతోషంగా బాగుండాలని ఈ సమయాన్ని ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది.

పెళ్లి పూర్తి అయిన  అదే రోజు సాయంత్రం 8:30 గంటలకు రిసెప్షన్ కార్యక్రం కూడా  ఇటలీలో పూర్తి చేసుకుని ఆ తర్వాత ఈ కొత్త జంట ఇండియాకు తిరిగి రానుంది. నవంబర్‌ 5న హైదరాబాద్‌లో మరోసారి రిసెప్షన్‌ కార్యక్రమం జరగనుంది. అందులో సుమారు 1000 మందికి పైగా మెగా కుటుంబానికి చెందిన సినీ,రాజకీయ స్నేహితులు హాజరుకానున్నారని సమాచారం.

 
Advertisement
 
Advertisement