భారీగా డబ్బులు తీసుకొని ప్రమోషన్స్‌ రావట్లేదు.. ఆరోపణలపై వరలక్ష్మీ స్పందన | Varalakshmi Sarathkumar Respond On Police Complaint Director Allegations | Sakshi
Sakshi News home page

లక్షల లక్షల డబ్బులు తీసుకొని ప్రమోషన్స్‌ రావట్లేదు.. ఆరోపణలపై వరలక్ష్మీ స్పందన

Jun 11 2026 12:13 PM | Updated on Jun 11 2026 12:31 PM

Varalakshmi Sarathkumar Respond On Police Complaint Director Allegations

ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌పై దర్శకుడు సంజీవ్‌ మేగోటి సంచనల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ద‌ర్శ‌క‌త్వంలో వరలక్ష్మీ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ . ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ విషయంలో  వ‌ర‌ల‌క్ష్మి త‌మ‌కు స‌హ‌క‌రించ‌డం లేదని, ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల డబ్బులు తీసుకొని కూడా ప్రమోషన్స్‌కి రావడం లేదని ఆయన ఫైర్‌ అయ్యాడు. 

దీనిపై తాజాగా వరలక్ష్మీ స్పందించింది. అవ‌స‌ర‌మైన స‌మ‌యాల్లో తాను టీమ్ కి అందుబాటులో ఉన్నానని, దర్శకుడి ఆరోపణలపై స్పందించి ఈ వివాదం పెద్దది చేయడానికి తనకు ఇష్టం లేదని చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో ఓ నోట్‌ పెట్టింది.

‘నన్ను దేనికైతే పిలిచారో, వాటన్నింటికీ నేను హాజరయ్యాను. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు నాపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో నాకు పూర్తిగా తెలియదు, కాబట్టి వాటిపై పూర్తి అవగాహన లేకుండా స్పందించడం సరికాదు. కొన్ని విషయాల్లో నాకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అందుకే చిత్రబృందం చేస్తోన్న ఆరోపణల గురించి బహిరంగంగా చర్చించాలని అనుకోవడం లేదు’ అని వరలక్ష్మీ అన్నారు. అంతేకాదు మరో పోస్ట్‌లో ‘కొన్ని కుక్కలు అరుస్తాయి. కానీ క‌ర‌వ‌వు. నేను అర‌వ‌ను.. కానీ క‌రుస్తా’ అంటూ ప‌రోక్షంగా సంజీవ్‌కి కౌంటర్‌ ఇచ్చింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement