Vadu Evadu: సస్పెన్స్‌.. థ్రిల్‌

Vadu Evadu first look poster and teaser released by Talasani Srinivas Yadav - Sakshi

‘‘వాడు ఎవడు’ టీజర్‌ చాలా బాగుంది. వాస్తవ ఘటనలతో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కార్తికేయ, అఖిలా నాయర్‌ జంటగా నటించిన చిత్రం ‘వాడు ఎవడు’. మాధురి, పూజిత సమర్పణలో రాజేశ్వరి సినీ     క్రియేషన్స్‌పై ఎన్‌. శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, టీజర్‌ని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విడుదల చేశారు. ఎన్‌. శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. మంచి సందేశం ఇస్తున్నాం. మా సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు. ‘‘వైజాగ్‌లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది’’ అని ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన రాజేశ్వరి పాణిగ్రహి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ గండ్రకోటి, సంగీతం: ప్రమోద్‌ కుమార్, నేపథ్య సంగీతం: రాజేష్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top