పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో విడుదలైన కొత్త మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. మార్చి 19న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఉగాది, రంజాన్ సెలవులు ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. తొమ్మిదిరోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 68.06 కోట్ల నెట్ రాబట్టినట్లు సాక్నిల్క్ ట్రేడ్ సంస్థ ప్రకటించింది. అయితే, ఓవర్సీస్‌లో ఉస్తాద్ కనీసం 1మిలియన్ మార్క్ కూడా దాటలేదు. ఆపై శుక్రవారం నాడు నార్త్ అమెరికాలో ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
నార్త్ అమెరికాలో ఉస్తాద్ భగత్‌సింగ్ ఇప్పటి వరకు రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టింది. అక్కడ లాభాల్లోకి ఈ చిత్రం రావాలంటే కనీసం మరో రూ. 7 కోట్లు రాబట్టాలి. లేదంటే భారీ నష్టాలు తప్పవు. ఇప్పటి వరకు ఈ సినిమా కనీసం 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా అక్కడ అందుకోకపోవడంతో ట్రేడ్ నిపుణులు నివ్వెరపోయారు.
శుక్రవారం నాడు అయితే అమెరికాలో కేవలం 4వేల డాలర్లు రూ. 3.79 లక్షలు మాత్రమే రాబట్టింది. సినిమా డిజాస్టర్ కావడంతో చాలాచోట్ల ఉస్తాద్‌ను తొలగించేశరాఉ. ఇది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద తమ అంచనాలను నిరాశపరిచినందుకు దర్శకుడు హరీష్ శంకర్‌ను చాలామంది ఫ్యాన్స్ నిందిస్తున్నారు. దీంతో ఆయన సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే, అమెరికాలో ధురంధర్-2 దుమ్మురేపుతుంది. ప్రస్తుతం రూ. 275 కోట్లు సాధించి రికార్డ్ నెలకొల్పింది.
North America Thursday Gross | Totals: #DhurandharTheRevenge - $643K | $18.06M#Aadu3 - $8K | $465K#BandMelam - $6K | $8K#Youth - $4K | $98K#UstaadBhagatSingh - $4K | $780K
— Venky Box Office (@Venky_BO) March 27, 2026


