
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు చేసింది. గురు పౌర్ణమి రోజున ప్రారంభించిన సాయిబాబా వ్రతం పూర్తి చేసుకుంది. తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో పూర్తి చేశానని సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఈ వ్రతాన్ని లతా సిస్టర్తో(క్లీంకార నర్సు) కలిసి ప్రారంభించినట్లు తెలిపింది.
ఉపాసన తన ఇన్స్టాలో రాస్తూ..' గురు పూర్ణిమ నాడు ప్రారంభమైన నా సాయిబాబా వ్రతం 9 వారాల పాటు కొనసాగింగి. శాంతి, విశ్వాసం, స్వస్థతతో నా ప్రయాణం ముగిసింది. నేను ఈ వ్రతాన్ని కారా నర్సు లతా సిస్టర్తో కలిసి ప్రారంభించా. నేను అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఆశీర్వదించినందుకు బాబాకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నిత్యం మాకు రక్షణగా ఉన్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు. మీ కృపతో నా జీవితంలో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయాలని నేను ప్రార్థిస్తున్నా. అత్తమ్మాస్ కిచెన్ తరఫున ఈ రోజు ఉచితంగా భోజనం వడ్డిస్తున్నాము. జై సాయిరామ్' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.