Ilayaraja: ఘనంగా ట్రిబ్యూట్‌ టు ఇళయరాజా మ్యూజికల్‌ ఈవెంట్‌

Tribute to Ilayaraja Musical Event Held In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో "ట్రిబ్యూట్ టు ఇళయరాజా " మ్యూజికల్ ఈవెంట్‌ నిర్వహించారు. ఆదివారం ఇళయరాజా లైవ్ కన్సర్ట్ జరగనున్న నేపథ్యంలో శనివారం "ట్రిబ్యూట్ టు ఇళయరాజా" ఈవెంట్‌ సాయంత్రం 6:30 నుంచి 10.00 గంటల వరకు రెడ్ కార్పెట్ ఈవెంట్ కార్యక్రమం కొనసాగింది. హైదరాబాద్ టాకీస్ వారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది.

ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలోని అలనాటి మధురమైన పాటలను ఆయన ముందే గాయనీ గాయకులు వీనులవిందుగా ఆలపించారు. ఇళయరాజా పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. అనంతరం ఇళయరాజాకు సన్మానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాలతో సత్కరించారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు ఇళయరాజాను శాలువాతో సన్మానించారు.

దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాత అశ్వినీదత్, సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్.పీ.పట్నాయక్, పాటల రచయిత హరి రామజోగయ్య శాస్త్రి, నిర్మాత సి.కళ్యాణ్, నటుడు మురళీమోహన్, ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్, గాయని సునీత, నటుడు రఘుబాబులు ఇళయరాజాను సన్మానించారు. ఇళయరాజా 80 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్న సందర్బంగా 80 ఏళ్ల లోగోను ప్రముఖ రచయితా విజయేంద్రప్రసాద్ రిమోట్‌తో ఆవిష్కరించారు. కమ్మని సంగీతం..ఎంత విన్నా...వినాలనిపించే సాహిత్యం ఇళయరాజా పాటల్లో ఉంటుందని అని సినీ ప్రముఖులు కొనియాడారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top