హలో హాలీవుడ్ అంటున్న రాజ్ దాసిరెడ్డి | Tollywood Hero Raj Dasireddy To Introduce To Hollywood | Sakshi
Sakshi News home page

హలో హాలీవుడ్ అంటున్న రాజ్ దాసిరెడ్డి

Oct 24 2021 2:19 PM | Updated on Oct 24 2021 2:19 PM

Tollywood Hero Raj Dasireddy To Introduce To Hollywood - Sakshi

ప్రముఖ దర్శకుడు మారుతి సారధ్యంలో రూపొంది మంచి విజయం సాధించిన ‘భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ’తో హీరోగా పరిచయమైన రాజ్ దాసిరెడ్డి తాజాగా హాలీవుడ్ కి హలొ చెబుతున్నాడు.  ఆ మూవీ తర్వాత  హాలీవుడ్‌ నుంచి ఆఫర్‌ రావడంతో తెలుగులో సినిమాలు చేయలేకపోయాడు. ప్రస్తుతం ఆయన ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2022లో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. 

నేడు రాజ్‌ దాసిరెడ్డి బర్త్‌డే.ఈ సందర్బంగా ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. ప్రధాని నుంచి శుభాకాంక్షలు అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు రాజ్‌ దాసిరెడ్డి. మన తెలుగువారంతా గర్వపడేలా హాలీవుడ్ లో తన కెరీర్ తీర్చిదిద్దుకుంటానని, తెలుగులోనూ కొన్ని చిత్రాల కోసం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తానని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement