క్రీడారంగంలో అడుగుపెట్టిన నాగచైతన్య.. ఏ టీమ్‌ అంటే? | Tollywood Hero Naga Chaitanya Buys A Sports Team In IRF Race, Watch Video Inside Goes Viral | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: ఆ జాబితాలో మొదటి టాలీవుడ్ హీరోగా చైతూ.. అదేంటంటే?

Aug 22 2024 9:10 PM | Updated on Aug 23 2024 2:18 PM

Tollywood Hero Naga Chaitanya Buys A Sports Team In Irf Race

టాలీవుడ్‌ హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ అంచనాలు మరింత పెంచేశాయి. ఈ మూవీని డిసెంబ‌ర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

అయితే నాగచైతన్య తాజాగా క్రీడారంగంలోకి అడుగుపెట్టారు. అదేంటి ఆయన యాక్టర్‌ కదా.. ప్లేయర్ ఎప్పుడు అయ్యారని అనుకుంటున్నారా? అదేం కాదండి. ఎందుకంటే ఆయన ఎంట్రీ ఇస్తున్నది ఆటగాడిగా కాదు.. యజమానిగా. ప్రముఖ ఫార్ములా రేసింగ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ టీమ్‌ను చైతూ కొనుగోలు చేశారు. దీంతో ఓ రేసింగ్‌ టీమ్‌ యజమానిగా టాలీవుడ్‌లో మొదటి హీరోగా నిలిచారు. ఇండియన్‌ రేసింగ్ ఫెస్టివల్‌-2024 గేమ్స్‌ ఆగ‌స్ట్ 24 నుంచి మొద‌లుకానున్నాయి.

కాగా.. ఇండియ‌న్ రేసింగ్ లీగ్‌లో మొత్తం ఆరు టీమ్స్ పోటీప‌డ‌నున్నాయి. హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్‌తో పాటు కోల్‌క‌తా రాయ‌ల్ టైగ‌ర్స్‌, స్పీడ్ డెమోస్ ఢిల్లీ, చెన్నై ట‌ర్బో రైడ‌ర్స్‌, బెంగ‌ళూరు స్పీడ్‌స్ట‌ర్స్‌, గోవా ఏసెస్ జేఏ రేసింగ్‌లో పోటీ పడనున్నాయి. వీటిలో  కోల్‌క‌తా రాయ‌ల్ టైగ‌ర్స్ టీమ్‌కు బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు సౌర‌భ్ గంగూలీ ఓన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. స్పీడ్ డెమోస్ ఢిల్లీ టీమ్‌ను అర్జున్ క‌పూర్‌, గోవా ఏసెస్ టీమ్‌ను జాన్ అబ్ర‌హ‌ం కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement