ఓటీటీకి టాలీవుడ్‌ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Tollywood Crime Comedy Thriller Paarijatha Parvam streaming On This Date | Sakshi
Sakshi News home page

article header script

Paarijatha Parvam Movie: ఓటీటీకి టాలీవుడ్‌ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Fri, Jun 7 2024 6:56 PM | Last Updated on Fri, Jun 7 2024 7:16 PM

Tollywood Crime Comedy Thriller Paarijatha Parvam streaming On This Date

చైతన్యరావు, శ్రద్ధాదాస్‌, మాళవికా సతీశన్‌  ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం 'పారిజాత పర్వం'. కిడ్నాప్‌ చేయడం ఓ కళ అన్నది ఉప శీర్షిక. ఏప్రిల్‌ 19న థియేటర్లలోకి వచ్చిన క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ సినీ ప్రియులను అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా జూన్‌ 12 నుంచి ప్రసారం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కిడ్నాప్‌ నేపథ్యంలో సాగే ఈ కథను సంతోష్‌ కంభంపాటి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మహీధర్‌ రెడ్డి, దేవేష్‌ నిర్మించారు. ఈ చిత్రంలో సునీల్‌, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. 

‘పారిజాత పర్వం’ కథేంటంటే?

చైతన్య(చైతన్య రావు) దర్శకుడు కావాలని హైదరాబాద్‌ వస్తాడు. తన స్నేహితుడు(వైవా హర్ష)ని హీరోగా పెట్టి ఓ సినిమాను తెరకెక్కించాలనేది అతని కల. దాని కోసం కథతో నిర్మాతల చుట్టూ తిరుగుతాడు. కానీ కొంతమంది కథ నచ్చక రిజెక్ట్‌ చేస్తే.. మరికొంతమంది హీరోగా అతని స్నేహితుడిని పెట్టడం ఇష్టంలేక రిజెక్ట్‌ చేస్తుంటారు. చివరకు చైతన్యనే నిర్మాతగా మారి సినిమా తీయాలనుకుంటాడు. డబ్బు కోసం ప్రముఖ నిర్మాత శెట్టి(శ్రీకాంత్‌ అయ్యంగార్‌) భార్య(సురేఖ వాణి)ను కిడ్నాప్‌ చేయాలనుకుంటారు. మరోవైపు బారు శ్రీను -పారు(శ్రద్ధాదాస్‌) గ్యాంగ్‌ కూడా శెట్టి భార్యనే కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్‌ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యను కిడ్నాప్‌ చేసిందెవరు? అసలు బారు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏంటి? చైతన్య, బార్‌ శ్రీను ఎలా కలిశారు? శెట్టి భార్యను కిడ్నాప్‌ చేయమని బార్‌ శ్రీను గ్యాంగ్‌కి చెప్పిందెవరు? వాళ్ల ప్లాన్‌ ఏంటి? చివరకు చైతన్య సినిమా తీశాడా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement