రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రం.. సడన్‌గా ఓటీటీలోకి! | Sakshi
Sakshi News home page

OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్‌ మూవీ

Published Fri, Mar 22 2024 2:21 PM

Teri Baaton Mein Aisa Uljha Jiya Streaming On This OTT Platform - Sakshi

బాలీవుడ్‌ స్టార్స్‌ షాహిద్‌ కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'తేరీ బాతోన్‌ మే ఐజా ఉల్జా జియా'. జాన్వీ కపూర్‌ అతిథి పాత్రలో మెరిసింది. అమిత్‌ జోషి, ఆరాధన సాహ్‌ ద్వయం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. మొదట్లో మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆ తర్వాత మంచి వసూళ్లనే రాబట్టింది. దాదాపు రూ.130 కోట్లు రాబట్టి సూపర్‌ హిట్‌గా నిలిచింది. 

ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. సడన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కాకపోతే రెంట్‌ పద్ధతిలో అందుబాటులో ఉంది. ఈ మధ్య చాలా సినిమాలను అమెజాన్‌ ప్రైమ్‌ తన ప్లాట్‌ఫామ్‌లో ముందుగా అద్దె పద్దతిలోనే తీసుకువస్తోంది. కొన్నాళ్ల తర్వాతే ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ మూవీ చూడాలంటే రెంట్‌ చెల్లించాల్సిందే!

చదవండి: స్టార్‌ హీరోహీరోయిన్లు డిప్రెషన్‌లో.. నాకు అలాంటి లైఫ్‌ వద్దు!

Advertisement
 
Advertisement