
మగరాయుడి గెటప్‌తోనే పాపులర్ అయింది తెలుగింటి అమ్మాయి స్నిగ్ధ (Actress Snigdha Nayani). 'అలా మొదలైంది' సినిమాతో తన కెరీర్ మొదలైంది. మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్ కాదల్, చందమామ కథలు, టైగర్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ ఇలా అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం స్నిగ్ధ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.. కానీ సింగర్‌గా పలు షోలు చేస్తోంది. ఈ నటి రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా మగరాయుడిలాగే ఉంటుంది.
ఆ కారణం వల్లే ముఖంపై..
పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండిపోతానని చెప్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధకు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. ముఖంపై గడ్డాలు, మీసాలు రావడానికి గల కారణమేంటని యాంకర్ అడిగాడు. అందుకు స్నిగ్ధ స్పందిస్తూ.. షూటింగ్స్‌కు వెళ్తున్న సమయంలోనే పీసీఓడీ వచ్చింది. దీని వల్ల అవాంచిత రోమాలు వస్తుంటాయి. అలాగే చాలామంది అమ్మాయిలకు ఫేషియల్ హెయిర్ ఉంటుంది.
గుండు గీయించుకున్నా..
నెలకోసారి థ్రెడింగ్ చేసుకుంటారు. ఇది చాలా మామూలు విషయం. అయితే నేను షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు నా ముఖంపై హెయిర్ కనిపిస్తుందనగానే వెంటనే మేకప్‌మ్యాన్ లేజర్‌తో గీకేసేవారు. దానివల్ల అదింకా ఎక్కువైంది. మరో విషయమేంటంటే.. ఎంబీఏ అయిపోగానే నేను గుండు చేయించుకున్నాను. అప్పుడతడు నా తలపై నుంచి ముఖం మీది దవడ వరకు బ్లేడుతో గీకాడు. అప్పటినుంచే అవాంచిత రోమాలు రావడం చిన్నగా మొదలైంది. మా అమ్మక్కూడా ఫేషియల్ హెయిర్ ఉంది అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.
చదవండి: సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ దర్శకుడిని చితకబాదిన స్టార్ హీరో