టైటిల్‌ చాలా బాగుంది  | Tammareddy Bharadwaj Speech at Sandigdham Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

టైటిల్‌ చాలా బాగుంది 

May 28 2026 5:29 AM | Updated on May 28 2026 5:29 AM

Tammareddy Bharadwaj Speech at Sandigdham Movie Pre Release Event

– తమ్మారెడ్డి భరద్వాజ్‌ 

‘‘సందిగ్ధం’ టైటిల్‌ చాలా బాగుంది... అచ్చమైన తెలుగు టైటిల్‌. ఎంతో కష్టపడి అడవుల్లో ఈ మూవీ తీశారని టీజర్, ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తోంది. ఇలాంటి చిన్న సినిమాని అందరూ ముందుండి ప్రమోట్‌ చేయాలి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ తెలిపారు. 

నిహాల్, ప్రియా దేశ్‌పాగ్, అర్జున్‌ సీహెచ్, కాజల్‌ తివారి ప్రధాన పాత్రల్లో, నవీన్‌ సంకరపు విలన్‌గా నటించారు. పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో సంధ్య తిరువీధుల నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి తమ్మారెడ్డి భరద్వాజ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్థసారధి మాట్లాడుతూ– ‘‘అందరూ ఎంజాయ్‌ చేసేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని నిహాల్, ప్రియా దేశ్‌పాగ్‌ కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement