ఒక్క సినిమాకు రూ.200 కోట్లు.. మరి సీఎంగా నెల జీతమెంత? | Taminadu Vijay CM Monthly Salary Compare With Movies | Sakshi
Sakshi News home page

Vijay: ఒక్క సినిమాకు రూ.200 కోట్లు.. మరి సీఎంగా వచ్చే జీతమెంత?

May 11 2026 4:05 PM | Updated on May 11 2026 4:35 PM

Taminadu Vijay CM Monthly Salary Compare With Movies

సినిమాల్లో సక్సెస్ అయిన హీరో విజయ్.. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించారు. పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం అయ్యారు. తమిళనాడు ఎన్నికల్లో మెజార్టీ మార్క్ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు ఆయన నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ చిత్రం సెన్సార్ వివాదాలతో రిలీజ్‌ కాలేదు. ఈ మూవీకి దళపతి ఏకంగా రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపించింది.

కానీ ఇప్పుడు విజయ్ హీరో కాదు.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక్క సినిమాకు రూ.200 కోట్లు తీసుకునే విజయ్.. సీఎంగా ఎంత సంపాదిస్తారనే దానిపై ప్రతి ఒక్కరిలో ​‍ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రజల సొమ్మును తాను తినని స్పష్టం చేసిన విజయ్.. సీఎంగా తనకొచ్చే నెల జీతంతోనే సర్దుకుపోతారా? ‍అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్‌కి నెలకు రూ.2,05,000 జీతం అందుకోనున్నారు. సినిమాల్లో ఒక్క సినిమాకే కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విజయ్.. ఇకపై ఏడాది కేవలం రూ. 34.2 లక్షల జీతం మాత్రమే ఆయనకు దక్కనుంది. అయితే వీటితో పాటు  ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్, జెడ్ ప్లస్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన విజయ్.. ఇప్పటికే సినిమాలు చేయనని చెప్పేశారు. తన చివరి మూవీ జన నాయగన్ అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement