రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి వరస సినిమాలైతే చేస్తున్నారు గానీ ఎందుకో అనుకున్నంతగా వర్కౌట్ కావట్లేదు. చాన్నాళ్ల క్రితం రూట్ మార్చిన చిరు.. వీలైనంత వరకు యువ దర్శకులతోనే కలిసి పనిచేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు మూవీస్ ఉన్నాయి. సెట్స్ పైన మాత్రం రెండింటి పనినడుస్తోంది. ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ బయటకొచ్చింది.
(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)
ప్రస్తుతం 'విశ్వంభర'తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' అనే మూవీ చేస్తున్నారు. ఇది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇందులో చిరుతో పాటు వెంకటేశ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ మేరకు కొన్నిరోజుల క్రితమే వెంకీ షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. ఇది పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు మరో మూవీ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓ రూమర్ వినిపిస్తుంది.
చిరు-బాబీ కాంబో ప్రాజెక్ట్ గురించి కొన్నాళ్ల క్రితం అనౌన్స్‌మెంట్ వచ్చింది. వచ్చే ఏడాది ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీలో తమిళ హీరో కార్తీ.. కీలక పాత్రలో నటించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇది నిజమే కావొచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా చిరు సినిమాల్లో ఎవరో ఓ హీరో అతిథి పాత్రల్లో కనిపిస్తూనే ఉన్నారు. 'ఆచార్య'లో రామ్ చరణ్, 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్, 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ.. ప్రస్తుతం చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'లో వెంకటేశ్‌తో ఇలా ఫార్ములా ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తుంది. అలా కార్తీతో త్వరలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది.
(ఇదీ చదవండి: ఈ పాన్ ఇండియా నటుడిని గుర్తుపట్టారా? బయోపిక్ కోసం ఇలా)


