ఇటీవల ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్న హీరోయిన్ పేరు తమన్న. 13వ వేటనే ఇండస్ట్రీలో ఎంట్రీ ముంబయి ముద్దుగుమ్మ 2005లో శ్రీ అనే తెలుగు చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కేడీ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. తన గ్లామర్‌తో అగ్ర కథానాయక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఈమె వయసు 33 ఏళ్లు కాగా.. నటిగా దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్‌గా ఉన్న తమన్న ఇటీవలే విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది.
(ఇది చదవండి: 'సలార్' టీజర్ ఓకే.. కానీ డైరెక్టర్‌ని ఓ విషయంలో మెచ్చుకోవాలి!)
అయితే నటిగా గ్లామర్ విషయంలో మాత్రం రోజు రోజుకు మరింత బోల్డ్‌గా తయారవుతోంది. ఎందుకంటే ఇటీవలే జీ కర్దా, లస్ట్ స్టోరీస్- 2 వెబ్ సిరీస్‌ల్లో ఈమె శృంగార భరిత సీన్స్‌తో పీక్ స్టేజ్‌కు చేరుకుందనే చెప్పాలి. దీంతో పలువురు తమన్నకు ఏమైంది అంటూ ఘాటుగా విమర్శిస్తుంటే.. ఆవిడ మాత్రం ఈ సమాజానికి ఏమైంది అంటూ ప్రశ్నించడం మరో విశేషం.
లస్ట్ స్టోరీస్– 2 వెబ్, జీ కర్దా సిరీస్‌లలో బెడ్ రూమ్ సన్నివేశాలను లిప్ లాక్ సన్నివేశాలలో విజృంభించి నటించిన తమన్నా తాను సినిమాలో నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలనుకుంటున్నానని అందుకే అలా నటిస్తున్నట్లు సమర్ధించుకుంది. అయితే తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో నటించడానికి ఏకంగా రూ.7 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది.
సాధారణంగా ఈమే తీసుకునేది నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల లోపే ఉంటుంది. కాగా లస్ట్ లవ్ స్టోరీస్- 2 వెబ్ సిరీస్‌లో ఆమెకు హద్దులు మీరిన శృంగార భరిత సన్నివేశాలు 30 నిమిషాల వరకు ఉండడంతో తమన్నా నటించడానికి నిరాకరించరాదన్న కారణంగా నిర్మాతలు ఆమెకు రూ.7 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ గోల్డెన్ బ్యూటీ తమిళంలో రజినీకాంత్ సరసన నటిస్తున్న జైలర్ చిత్రం ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది. మరోవైపు తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న భోళాశంకర్ చిత్రం ఆగస్టు 11వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి.
(ఇది చదవండి: వాళ్లు నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు: హీరోయిన్ ఐశ్వర్య)
Comments
Please login to add a commentAdd a comment