
బాలీవుడ నటి తాప్సీ పన్ను ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. తన సోదరి సోదరి షగున్‌తో కలిసి తాజాగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారని స్క్వేర్ యార్డ్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) పోర్టల్ ద్వారా సమాచారం వెలువడింది. ఇప్పటికే ఆమెకు ముంబైలో ఒక ఇల్లు ఉంది. అది ప్రాచీన పంజాబీ కళతో ఆకట్టుకుంటుంది. తన సోదరి వెడ్డింగ్ ప్లానర్ కావడంతో ఆ ఇంటిని చాలా అందంగా డెకరేషన్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
తాప్సీ పన్ను, ఆమె సోదరి షగున్ పన్నుతో కలిసి ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లో రూ.4.33 కోట్లతో ప్రీమియం అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్‌ణు కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) పోర్టల్‌లో ఈ సమాచారం ఉంది. అందుకు సంబంధించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా పోర్టల్‌లో ఉన్నాయి. రెడీ-టు-మూవ్-ఇన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కావడంతో వారు త్వరలోనే కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.21.65 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు అదనంగా రూ.30,000 ఛార్జీలను చెల్లించారు. ముంబైలోని ఇంపీరియల్ హైట్స్ ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ చదరపు అడుగుకు రూ.32,170గా ఉంది. ఇది ఈ ప్రాంతంలో అత్యంత డిమాండ్ ఉన్న లగ్జరీ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు ఉంది.
కొత్త ఇల్లు తన సోదరి షగున్ కోసం తాప్సీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన తాప్సీ తన భర్త మథియాస్ బోతో పాత ఇంట్లోనే ఉంటుంది. అతను డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసిందే. కొన్నేళ్లుగా వారిద్దరూ అదే ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి తర్వాత తన సోదరికి ఒక సొంత ఇల్లు ఉండాలని తాప్సీ కొన్నట్లు సమాచారం.