
సాయం చేయాలనే మనసుంటే చాలు. అందుకు తగిన డబ్బులు సమకూర్చడానికి మార్గాలు చాలానే ఉంటాయి. దర్శకుడు సుశీంద్రన్ అలాంటి కార్యానికి శ్రీకారం చుట్టారు. వెన్నిల కబడ్డీ కుళు చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సుశీంద్రన్ ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి మేరకు కరోనా నివారణ నిధికి తన వంతు సాయం అందించాలని భావించారు.
వెన్నిలా ఫీచర్ సినిమాస్ పేరుతో ఇటీవల పది రోజులు నటన, దర్శకత్వ శాఖలో ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. తద్వారా వచ్చిన రూ.5 లక్షలను చెక్కు రూపంలో కరోనా నివారణ నిధికి ఆదివారం నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్‌కు అందజేశారు.