ఆకట్టుకుంటున్న ‘అరి’ ఫస్ట్‌ లుక్‌ | Surya Purimetla's character first look released from 'Ari' movie - Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘అరి’ ఫస్ట్‌ లుక్‌

Published Tue, Jan 23 2024 10:11 AM

Surya Purimetla character first look Rleased From Ari Movie - Sakshi

‘పేపర్ బాయ్’ ఫేమ్‌  జయశంకర్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక.ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంగా బాల రాముని దివ్యాశిస్సులతో ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ను సోమవారం ఇంట్రడ్యూస్ చేశారు. సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్  ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement