ఇలాంటి వార్తలను నమ్మకండి :నటి సుహాసిని

Suhasini refutes rumour about Mani Ratnam joining Twitter - Sakshi

ప్రముఖ దర్శకులు మణిరత్నం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌లో  అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే అభిమానులకు ఆనందమే. బుధవారం అలాంటి ఆనందమే దక్కింది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. జూన్‌ 2న మణిరత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చారన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపై మణిరత్నం భార్య, ప్రముఖ నటి సుహాసిని స్పందించారు. ‘‘బుధవారం మణిరత్నం ట్విటర్‌ అకౌంట్‌ను స్టార్ట్‌ చేసినట్లుగా ఒక వ్యక్తి మణిరత్నం పేరుతో ట్వీట్‌ చేశాడు. ఇలాంటి నకిలీ అకౌంట్‌ను నమ్మొదు. దయచేసి అప్రమత్తంగా ఉండండి’’ అని పేర్కొన్నారు సుహాసిని.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top