Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Teaser Postponed - Sakshi
Sakshi News home page

సుధీర్‌బాబు-కృతిశెట్టి సినిమా : ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌

Jan 17 2022 3:59 PM | Updated on Jan 17 2022 4:54 PM

Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Teaser Postponed - Sakshi

Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Teaser Postponed: హీరో సుధీర్‌ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె విడుదల చేసిన మూవీ ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా నేడు(సోమవారం) ఈ సినిమా టీజర్‌ విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.

ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్‌ అనౌన్స్‌ చేసింది.త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. కాగా 'ఉప్పెన','శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' వంటి హిట్‌ సినిమాల అనంతరం కృతిశెట్టి చేస్తున్న నాలుగో చిత్రమిది. దీంతో అంచనాలు మరిన్ని పెరిగాయి. 

Advertisement
 
Advertisement
Advertisement