Pushpa Movie: Rashmika Mandanna's Srivalli Song Promo Released - Sakshi
Sakshi News home page

Pushpa Movie: రష్మిక ‘ శ్రీ వ‌ల్లి’ ప్రోమో సాంగ్ విడుద‌ల‌

Oct 12 2021 1:22 PM | Updated on Oct 12 2021 3:50 PM

Srivalli Second Single Promo Released From Pushpa Movie - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప‌’. రష్మిక మందన్నా హీరోయిన్‌. రెండు పార్టులుగా వస్తున‍్న..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప‌’. రష్మిక మందన్నా హీరోయిన్‌. రెండు పార్టులుగా వస్తున‍్న ఈ చిత్రంలో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ డిసెంబర్‌ 17న విడుదల కానుంది.  ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ దాక్కో దాక్కో మేకకి మంచి రెస్పాన్స్‌రాగా సెకండ్‌ సింగిల్‌పై అప్‌డేట్‌ వచ్చింది.

రష్మిక క్యారెక్టర్‌ ‘శ్రీ వ‌ల్లి’పై రానున్న ఈ పాటని అక్టోబర్‌ 13న ఉదయం 11.07కు విడుదల చేయనుంది మూవీ టీం. దీనికి సంబంధించిన ప్రోమోని మంగళవారం విడుదల చేశారు. ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే..’ అంటూ సాగిన ఆ ప్రోమో ఆడియన్స్‌లో ఎగ్జాయిట్‌మెంట్‌ని పెంచేలా ఉంది. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

చదవండి: బాలీవుడ్‌ భామ షాకింగ్‌ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌, అవాక్కైన మేకర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement