ఇకపై నా జీవితం సినిమాకే: డైరెక్టర్‌

Srikanth Sri Appalaraju About His Movies - Sakshi

రెండు పడవల ప్రయాణం నా వరకు సరిపడదని నాకనిపించింది. అందుకే నాకు ఎంతో ఇష్టమైన సినిమా రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నాను" అంటున్నారు శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసిన ఆయన "చీమ - ప్రేమ - మధ్యలో భామ!” (‘The Ant - The Love - and The Girl in between’) చిత్రంతో దర్శకుడిగా మారి తొలి చిత్రంతోనే తన ప్రతిభను ప్రకటించుకున్నారు. "మాగ్నం ఓపస్ ఫిలింస్‌" పతాకంపై రూపొందిన ఈ వినూత్న ప్రేమకథా చిత్రం... అమెరికా, కెనడా, ఫ్రాన్స్, లండన్ తదితర దేశాల ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డులు గెలుచుకుంది. 

శ్రీకాంత్‌ సినిమా రంగంలోకి ప్రవేశించేముందు కొన్ని షార్ట్ ఫిలింస్‌ చేసి, ఫిల్మ్ మేకింగ్ పట్ల పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకున్నారు. "మై కౌబాయ్, ఎందుకిలా, టేక్ ఇట్ ఈజీ" తదితర షార్ట్ ఫిల్మ్స్ శ్రీకాంత్ లోని స్పార్క్‌నెస్‌కు అద్దం పట్టి ఆయనకు "చీమ ప్రేమ మధ్యలో భామ" చిత్రానికి మెగాఫోన్ పట్టే అవకాశం తెచ్చిపెట్టాయి. "శ్రీకాంతరంగం" పేరుతో రాసుకున్న పుస్తకంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించుకున్న ఈయన ద్వితీయ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతూనే, తన మూడో చిత్రం కోసం కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. 

రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ, జేమ్స్ కామెరూన్ తన అభిమాన దర్శకులని చెప్పుకునే శ్రీకాంత్‌ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. తన చిత్రానికి గాత్రం అందించిన గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తమ సినిమా చూసి చిత్ర బృందాన్ని మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top