Allu Arjun Movie: Spicy Romance Scene Deleted From Pushpa Movie - Sakshi
Sakshi News home page

Pushpa: పుష్ప నుంచి ‘చేయి’సీన్‌ డిలీట్.. ఫ్యామిలీ ఆడియన్స్‌ హ్యాపీ!

Dec 18 2021 4:49 PM | Updated on Dec 20 2021 11:27 AM

Spicy Romance Scene Deleted From Pushpa Movie - Sakshi

సెకండాఫ్‌లో శ్రీవల్లీ, పుష్ప రాజ్‌ల మధ్య వచ్చే ఆ సీన్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం పుష్ప డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ కావడంలో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తొలి రోజు మాత్రం ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కానీ కలెక్షన్స్‌ పరంగా మాత్రం దూసుకెళ్లింది. తొలి రోజు దాదాపు  రూ. 38.49 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మాత్రం ఓ సీన్‌ విమర్శకులతో పాటు ఓ వర్గం ప్రేక్షకులు పెదవి విరిచారు.
(చదవండి: పుష్ప’ రాజ్‌ తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?)

అదే  పుష్ప‌-శ్రీ‌వ‌ల్లీల మ‌ధ్య న‌డిపిన `చేయి` ఎపిసోడ్. సెకండాఫ్‌లో అల్లు అర్జున్ తన వ్యాన్‌లో కూర్చొని  శ్రీ వల్లి భుజం పై చేయి వేసి ఫోన్ మాట్లాడతాడు.  తర్వాత పుష్ప చేయి శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్ పై వేసినట్లుగా చూపిస్తారు. అది ఫ్యామిలీ ఆడియన్స్‌ కాస్త ఇబ్బందిగా మారింది. ఇది కచ్చితంగా సుకుమార్‌ మార్క్‌ కాదు. సుకుమార్ ఇలా ఆలోచించ‌డు అనుకున్న‌వాళ్ల‌కు ఆ స‌న్నివేశం పంటికింద రాయిలా త‌గులుతుంది. ఫస్ట్ డే సినిమా చూసిన వాళ్ల  ఫీడ్ బ్యాక్ లో ఈ సీన్ గురించి ఉండటం.. ఈ విషయం సుకుమార్‌ వరకు వెళ్లడంతో.. ఆ సీన్‌ తొలగించాలి ఫిక్స్‌ అయ్యారట. ఆదివారం నుంచి సీన్‌ లేకుండా సినిమా ప్రదర్శించబడుతుందట. మొత్తానికి సుకుమార్ మంచి నిర్ణయమె తీసుకున్నారు.
(చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఓటీటీలోకి పుష్ప మూవీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement