
వీవీ వినాయక్, ‘దిల్’ రాజు, జున్ హ్యున్ జీ
‘‘నేను తెరకెక్కిస్తున్న 43వ చిత్రం ‘వేదవ్యాస్’. ఒక కొరియన్ హీరోయిన్‌ని తొలిసారి తెలుగులో పరిచయం చేస్తున్నాం. నా లైఫ్‌లో ఎన్ని సినిమాలైతే చేయగలనో అన్నింటినీ ప్రతాప్ రెడ్డిగారితో చేస్తాను’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘వేదవ్యాస్’ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది.
ఈ చిత్రంతో సౌత్ కొరియన్ నటి జున్ హ్యున్ జీ టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కాంగ్రెస్‌పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్‌కు నిర్మాత కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘కంగ్రాట్యులేషన్స్. వెల్‌కమ్ టు టాలీవుడ్’ అంటూ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ ‘దిల్’ రాజు... జున్ హ్యున్ జీకి బొకే అందించగా, ఆమె ‘థాంక్యూ సర్’ అనటాన్ని తొలి సన్నివేశంగా చిత్రీకరించారు.
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఎస్వీ కృష్ణారెడ్డిగారి మీద అభిమానంతోనే నిర్మాతను అయ్యాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని తెలి పారు. కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ–‘‘వేదవ్యాస్’ కృష్ణారెడ్డిగారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాలో హీరో ఎవరనేది మరో వారం పది రోజుల్లో వెల్లడిస్తాం’’ అని చె ప్పారు. ‘‘భారతీయ సంస్కృతి నేర్చుకుని ఈ సినిమాలో నటిస్తుండట హ్యాపీగా ఉంది’’ అన్నారు జున్ హ్యున్ జీ.