Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న రియల్‌ హీరో

Sonu Sood Helps 7 Month Old Boy From Karimnagar For Liver Transplantation - Sakshi

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందిచిన విషయం తెలిసిందే. కోవిడ్‌ కారణంగా సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి పలువురి ప్రాణాలును కాపాడారు. అప్పటి నుంచి ఆయన తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగానూ ఎంతోమందికి సహాయం అందిస్తున్నారు.

చదవండి: నటికి షాకిచ్చిన కొత్త బాయ్‌ఫ్రెండ్‌, 2 గంటల పాటు ఎయిర్‌ పోర్టులోనే..

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన, లేదా సర్జరీలు వంటి కోసం ఆర్థిక సాయం కావాలంటూ సోనూ సూద్‌కు ట్వీట్‌ చేస్తుంటారు. ఇలాంటివి తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి వారికి సాయం అందిస్తున్నారు ఆయన. అలా సామాజిక సేవతో ఎంతోమందిని ఆదుకుంటున్న ఆయన తాజాగా మరోసారి గొప్పమనసు చాటుకున్నారు. తాజాగా 7 నెల‌ల ఓ చిన్నారికి లివ‌ర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్‌కి (కాలేయ మార్పిడి చికిత్స‌) సాయం చేశారు ఆయన.

చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

కరీంనగర్‌కు చెందిన మహ్మద్ సఫన్ అలీ అనే చిన్నారికి బైలియరీ అట్రీసియా అనే వ్యాధి బారిన పడ్డాడు. దీనివల్ల అతడి కాలేయం పూర్తిగా దెబ్బతింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నారి వైద్యం కోసం అతడి తల్లిదండ్రులు సోనూసూద్‌ను సాయం కోరడంతో ఆయన ముందుకు వచ్చారు. తన ఛారిటీ ఫౌండేషన్‌ ద్వారా చిన్నారికి కేరళలోని కొచ్చి నగరంలో చికిత్స అందించారు. ఎస్తేర్ మెడ్ సిటీ హాస్పిటల్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top