కొరియోగ్రాఫర్ జానీకి అవకాశాలు.. సింగర్ చిన్మయి సంచలన ట్వీట్! | Singer Chinmayi tweet on choreographer jani master misuse the power | Sakshi
Sakshi News home page

Singer Chinmayi: కొరియోగ్రాఫర్ జానీకి అవకాశాలు.. సింగర్ చిన్మయి సంచలన ట్వీట్!

Nov 2 2025 6:32 PM | Updated on Nov 2 2025 7:20 PM

Singer Chinmayi tweet on choreographer jani master misuse the power

సింగర్ చిన్మయి శ్రీపాద ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్‌గా రాణిస్తూనే మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై పోరాటం చేస్తూనే ఉంటోంది. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద పేరు గట్టిగా వినిపించింది. తాజాగా చిన్మయి మరో చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్‌ కార్తీక్‌ లాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడంపై చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారికి అవకాశాలివ్వడం అంటే లైంగిక దాడులను ప్రోత్సహించడమేనంటూ సంచలన పోస్ట్ చేసింది గాయని. అధికారం, ప్రభావం, డబ్బును దుర్వినియోగం చేసే పురుషుల చేతుల్లో పెట్టడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు ఇవ్వడమేనని చిన్మయి మండిపడింది. మన నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. అది తప్పకుండా వదిలిపెట్టదని సింగర్‌ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్ కావడంతో చిన్మయికి మద్దతుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ మహిళ కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అంతేకాకుండా జానీ మాస్టర్‌పై పోక్సో కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు కోలీవుడ్ సింగర్ కార్తీక్‌పై సైతం లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
 

 

Advertisement
 
Advertisement
Advertisement