ఆ మాట నిలబెట్టుకున్నాం: శర్వానంద్‌ | Sharwanand Speech at Biker Thank You Meet | Sakshi
Sakshi News home page

ఆ మాట నిలబెట్టుకున్నాం: శర్వానంద్‌

Apr 12 2026 2:59 AM | Updated on Apr 12 2026 2:59 AM

Sharwanand Speech at Biker Thank You Meet

అభిలాష్, శర్వానంద్, మాళవిక

‘‘నేను మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాననే తెలుగు ప్రేక్షకుల నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ‘బైకర్‌’ చిత్రం తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని మొదటి నుంచే చెబుతున్నాను. మంచి ఫ్యామిలీ సినిమా తీసి, ఆ మాట నిలబెట్టుకున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్‌ మౌత్‌ టాక్‌ వల్ల మా చిత్రం అద్భుతంగా ఆడుతోంది’’ అని హీరో శర్వానంద్‌ తెలిపారు.

అభిలాష్‌ కంకర దర్శకత్వంలో శర్వానంద్, మాళవికా నాయర్‌ జోడీగా నటించిన చిత్రం ‘బైకర్‌’. విక్రమ్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ–ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదల అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో శర్వానంద్‌ మాట్లాడుతూ–‘‘అభిలాష్‌ మంచి తండ్రీ కొడుకుల కథ చెప్పాడు. నాకు అద్భుతమైన సినిమా అందించిన యూవీ క్రియేషన్స్కు ధన్యవాదాలు. నా వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను.

ఈ ఏడాది నాకు రెండు హిట్లు వచ్చాయి’’ అని చెప్పారు. అభిలాష్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘మా సినిమాలోని రేసింగ్‌తో పాటు తండ్రీ కొడుకు, భార్యాభర్తల భావోద్వేగాలకు కూడా ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతున్నారు. మొదటి రోజు నుంచే థియేటర్లకు వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ‘‘మా మూవీలోని ఎమోషన్ కు ఆడియన్స్ చాలా అద్భుతంగా కనెక్ట్‌ అవుతున్నారు’’ అన్నారు మాళవిక నాయర్‌.

Advertisement
 
Advertisement
Advertisement