Shah Rukh Khan: షారుక్ వాయిస్ ఓవర్‌తో పఠాన్ టీజర్, అదిరిపోయిందిగా..

ఎట్టకేలకు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నుంచి మూవీ అప్‌డేట్ వచ్చింది. షారుక్ వెండితెరపై సందడి చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. జీరో మూవీ తర్వాత షారుక్ నటిస్తున్న చిత్రం పఠాన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి షారుక్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. పఠాన్ మూవీ టీజర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించాడు. ఈ మేరకు షారుక్ ట్వీట్ చేస్తూ.. ‘నాకు తెలుసు చాలా ఆలస్యం అయ్యిందని. కానీ డేట్ గుర్తు పెట్టుకోండి.
చదవండి: 9 ఏళ్ల వయసులోనే షాకిచ్చాడు: వర్మ సోదరి ఆసక్తికర వ్యాఖ్యలు
‘పఠాన్’ టైం వచ్చింది. 2023 జనవరి 25న బిగ్ స్క్రీన్‌పై కలుసుకుందాం’ అంటూ రాసుకొచ్చాడు. ఇక టీజర్ విషయానికి వస్తే ఈ మూవీలోని జాన్ అబ్రహం, దీపికా పదుకొనెల పాత్రలను పరిచయం చేస్తూ షారుక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలగే చివరిలో షారుక్ ఎంట్రీ ఇవ్వడం బాద్‌షా అభిమానులకు సర్‌ప్రైజింగ్ ఉందా. చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ షారుక్ ఇలా చూడటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్‌లో 50వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓకేసారి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.
I know it’s late… But remember the date… Pathaan time starts now…
See you in cinemas on 25th January, 2023.
Releasing in Hindi, Tamil and Telugu.
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you. @deepikapadukone |@TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/dm30yLDfF7
— Shah Rukh Khan (@iamsrk) March 2, 2022