భావోద్వేగాల వదలనే... | Second song Release from Chennai Love Story | Sakshi
Sakshi News home page

భావోద్వేగాల వదలనే...

May 27 2026 12:52 AM | Updated on May 27 2026 12:52 AM

Second song Release from Chennai Love Story

మణిశర్మ, కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ, రవి నంబూరి

‘‘చెన్నై లవ్‌ స్టోరీ’లోని ‘వదలనే...’పాటనుపాండిచ్చేరిలో షూట్‌ చేశాం. ఒక అందమైన గుడి దగ్గర నాకు, గౌరికి సీన్‌ చెప్పారు డైరెక్టర్‌ రవి. ఆ సమయంలో మా ముగ్గురికీ కళ్లు చెమర్చాయి. అంత భావోద్వేగానికి గురయ్యాం. మణిశర్మగారు అన్నిపాటల్ని అద్భుతంగా కంపోజ్‌ చేశారు’’ అని కిరణ్‌ అబ్బవరం తెలిపారు. ఆయన హీరోగా, శ్రీ గౌరీప్రియ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘చెన్నై లవ్‌ స్టోరీ’. దర్శకుడు సాయిరాజేశ్‌ కథను అందించిన ఈ చిత్రాన్ని రవి నంబూరి దర్శకత్వంలో సాయిరాజేశ్, ఎస్‌కేఎన్‌ నిర్మించారు. 

మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘వదలనే..’ అంటూ సాగే సెకండ్‌ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి ఈపాటను విడుదల చేశారు.‘‘వదలనే...’ నా కెరీర్‌లో బెస్ట్‌ సాంగ్‌గా మిగిలిపోతుంది’’ అన్నారు రవి నంబూరి. ‘‘వదలనే...’ ఓ గొప్పపాటగా నిలిచిపోతుంది’’ అని సాయి రాజేశ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత ధీరజ్‌ మొగిలినేని, కెమెరామేన్‌ డేనియల్‌ విశ్వాస్‌ మాట్లాడారు. ఈ వేడుకలో పలువురు సంగీతదర్శకులుపాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement