సర్ధార్‌తో పాటు ఢిల్లీ ఎప్పుడు వస్తారంటే.. | Sardar And Khaidi Movie Sequel Release Plan | Sakshi
Sakshi News home page

సర్ధార్‌తో పాటు ఢిల్లీ ఎప్పుడు వస్తారంటే..

Oct 23 2023 6:46 AM | Updated on Oct 23 2023 6:48 AM

Sardar And Khaidi Movie Sequel Release Plan - Sakshi

నటనకు విరామం లేకుండా దూసుకుపోతున్న నటుడు కార్తీ. 2007లో తన తొలి చిత్రం పరుత్తివీరన్‌తోనే ఛాలెంజ్‌తో కూడిన పాత్రతో కథానాకుడిగా ఎంట్రీ ఇచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు కార్తీ. ఇటీవల నటించిన సర్ధార్‌ చిత్రం వరకు ఈయన నటనా జర్నీ చూస్తే 99 శాతం విజయాలే. ప్రస్తుతం 'జపాన్‌' అనే మరో వైవిధ్యమైన పాత్రతో తన విలక్షణ నటనతో దీపావళి పండుగకు సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. రాజు మురుగన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ది వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు.

ఇది కార్తీ నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం తన 26వ చిత్రాన్ని నలన్‌ కుమారసామి దర్శకత్వంలో చేస్తున్న కార్తీ.. మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లు ఆయనచేతిలో ఉన్నాయి. అందులో సర్ధార్‌ –2, ఖైదీ 2 చిత్రాలు ముఖ్యమైనవి. కాగా ఖైదీ 2 చిత్రం గురించి దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ఇటీవల అధికారికంగానే చెప్పారు. రజనీకాంత్‌తో చేసే చిత్రం తరువాత ఖైదీ 2 మొదలవుతుందని ఆయన చెప్పారు. ఈ రకంగా ఢిల్లీని (ఖైదీలో కార్తీ పేరు) చూడాలాంటే 2025 వరకు ఆగాల్సిందే.

కాగా తాజాగా సర్ధార్‌ 2 చిత్రం గురించి నటుడు కార్తీ అప్‌ డేట్‌ ఇచ్చారు. ఆయన తన ఇన్‌ స్ట్రాగామ్‌లో సర్ధార్‌ చిత్రం విడుదలై ఏడాది పూర్తి అయ్యిందని, త్వరలో సర్ధార్‌ – 2కు రెడీ అవుతున్నట్లు కార్తీ పేర్కొన్నారు. కాగా సర్ధార్‌ చిత్రాన్ని రూపొందించిన ప్రినన్స్‌ పిక్చర్స్‌ సంస్థనే దాని సీక్వెల్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తుండడం గమనార్హం. ఈ సినిమా 2024లో విడుదల కానుంది. ఈ భారీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement