సందిగ్ధం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? | Sandigdham Movie Review And Rating In Telugu, Decent Mystery Thriller With A Strong Interval Twist | Sakshi
Sakshi News home page

Sandigdham Movie Review: సందిగ్ధం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

May 29 2026 5:22 PM | Updated on May 29 2026 6:06 PM

Sandigdham Movie Review in telugu

నిహాల్, ప్రియా దేశ్‌పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సందిగ్ధం. ఈ మూవీలో తెరచాప ఫేమ్ నవీన్ సంకరపు విలన్ పాత్రలో కనిపించారు. పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కించారు.తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మించారు. మే 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్ ఎలా మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే..

క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ దేవ్ (నిహాల్) మేఘన (ప్రియా దేశ్ పాగ్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె కోసం ఊర్లో హాస్పిటల్ కట్టిస్తాడు. ఊహించని విధంగా దేవ్‌కి సత్య (అర్జున్), కల్యాణి (కాజల్ తివారి) ఎదురు పడతారు. ఆ ఊర్లో వారికి దేవ్ ఆశ్రయం ఇస్తాడు. అయితే ఆశ్చర్యకరంగా సత్య, కల్యాణి గ్రామంలోని ఇతరులకు కనిపించకుండా కేవలం దేవ్‌కి మాత్రమే కనిపిస్తుంటారు. అసలు ఆ ఇద్దరు ఎవరు? వారి గతమేంటి? దేవ్ జీవితంతో వారికి ఉన్న సంబంధం ఏంటి? వీర (నవీన్ సంకరపు), కోటయ్య, రామరాజు పాత్రల వెనుక ఉన్న అసలు కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

ఫస్ట్ హాఫ్ గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది. కథ చాలా నెమ్మదిగా సాగడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.  దేవ్ క్యారెక్టర్ పరిచయం.. మేఘనతో ప్రేమ కథ, గ్రామ జీవితం లాంటి సాధారణ సీన్లతో రోటీన్‌గా అనిపిస్తుంది. అయితే సత్య, కళ్యాణి పాత్రలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది

సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచే ప్రేక్షకుడికి కాస్తా థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది.  క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకుడిలో క్యూరియాసిటీ పెరుగుచుంది. అక్కడక్కడా సస్పెన్స్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని అంశాలను మాత్రం దర్శకుడు కాస్తా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫర్వాలేదనిపించాడు. ఓవరాల్‌గా ఓ థ్రిల్లర్‌ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది.  దర్శకుడు తాను రాసుకున్న కథను అనవసర కమర్షియల్ హంగులు లేకుండా నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి థ్రిల్లర్‌ కాన్సెప్ట్ ఇష్టపడేవారు సందిగ్ధం ట్రై చేయొచ్చు.


ఎవరెలా చేశారంటే..

దేవ్ పాత్రలో నిహాల్ బాగానే ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. మేఘన పాత్రలో ప్రియా దేశ్‌పాగ్ అందంతో పాటు పాత్రకు తగ్గట్టుగా నటించింది. అర్జున్, కాజల్ తివారి తమ పాత్రల్లో మెప్పించారు. విలన్‌గా నవీన్ సంకరపు ఫర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది.  విజువల్స్ సహజంగా కనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా అనిపించాయి.

 

Rating:
Advertisement
 
Advertisement
Advertisement