ఇటీవలే విడాకులు తీసుకున్న స్టార్ జంట.. మళ్లీ కలవడమేంటి? | Sandalwood Star Niveditha Gowda and Chandan Shetty About Her Divorce | Sakshi
Sakshi News home page

Niveditha Gowda: ఇటీవలే విడాకులు తీసుకున్న బ్యూటీ.. భర్తతో మళ్లీ కలిసి!

Published Tue, Jun 11 2024 2:33 PM

Sandalwood Star Niveditha Gowda and Chandan Shetty About her Divorce

ఏ జంట అయినా విడాకులు తీసుకుంటే దాదాపు కలవడానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా పొరపాటున బయట ఎదురుపడినా పలకరించడం లాంటివి కూడా జరగవు. చాలా జంటలు విడాకుల తర్వాత కలిసి మాట్లాడుకోవడం జరిగే అవకాశం చాలా తక్కువ. మరీ విడాకుల తర్వాత ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. అంతే కాదు ఏకంగా ప్రెస్‌ మీట్ పెడితే ఎలా ఉంటుంది. అలాంటిదే తాజాగా జరిగింది. ఓ స్టార్ జంట తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

శాండల్‌వుడ్ జంట నివేద గౌడ, చందన్ శెట్టి  ఇటీవలే విడాకులు తీసుకున్నారు.  ఏడాది క్రితమే వీరిద్దరూ విడాకులకు పిటిషన్ వేయగా.. ఇటీవలే కోర్టు విడాకులు మంజూరు చేసింది. శాండల్‌వుడ్‌లో క్యూటెస్ట్ కపుల్‌గా పేరున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్‌ డివోర్స్‌ గల కారణాలపై తెగ ఆరా తీస్తున్నారు. చందన్ శెట్టి, నివేద గౌడ ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఏమిటి? ఇలాంటి విషయాలపై ప్రతిరోజూ అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా విడిపోయిన తర్వాత కూడా నివేద గౌడ, చందన్ శెట్టి సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ బెంగళూరులోని ఓ మాల్‌లో నిర్వహించే ప్రెస్‌మీట్‌లో తాము విడిపోవడానికి గల కారణాలను వివరించనున్నారు. ఈ సమావేశంలో చందన్ శెట్టి, నివేద గౌడ పాల్గొని విడాకులపై మాట్లాడనున్నారు. ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇవ్వనున్నారు.

కాగా..  టిక్‌టాక్ స్టార్ నివేదా గౌడ బిగ్ బాస్ సీజన్- 5తో గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.  ఆ తర్వాత రాపర్‌గా రాణిస్తున్న చందన్ శెట్టి.. నివేదా గౌడపై  బొంబే బొంబే అనే పాట రాసి అందరినీ అలరించాడు. మైసూర్‌లోని జరిగిన  దసరా  వేడుకల్లో నివేద గౌడకు ప్రపోజ్ చేశాడు. అప్పట్లోనే అతని తీరు వివాదానికి దారితీసింది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement