విజయ్ దేవరకొండతో సమంత రొమాంటిక్ మూవీ!

విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయారు. ‘లైగర్’ సినిమా కోసం లాంగ్ హెయిర్‌తో ఉన్న విజయ్ ఇప్పుడు మిలటరీ హెయిర్ కట్ చేయించు కున్నారు. ఈ లుక్ తన తర్వాతి సినిమా కోసమేనట. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో ఆరంభం కానుందని, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తారనే టాక్ వినిపిస్తోంది.
అలాగే ఇది కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ అని, విజయ్ దేవరకొండ ఇందులో మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారని భోగట్టా. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన ‘లైగర్’ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. కాగా.. దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ‘లైగర్’ తర్వాత ‘జనగణ మన’ అనే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు