Samantha: సమంత బాలీవుడ్‌ డెబ్యూ చిత్రం నుంచి ఆసక్తికర అప్‌డేట్‌!

Samantha Plays Dual Role in Ayushmann Khurrana And Amar Kaushik Movie - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఆమె నటించిన శాకుంతలం షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. యశోద ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దీనితో పాటు ఆమె హాలీవుడ్‌లో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విడాకుల అనంతరం భారీ ప్రాజెక్ట్సకు సైన్‌ చేసి ఫుల్‌ బిజీగా సామ్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టాకుండానే అక్కడ ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ‘ది ఫ్యామిలీ మాన్‌’ వెబ్‌ సిరీస్‌తో నార్త్‌ ఆడియన్స్‌కు దగ్గరైన సామ్‌ హిందీలో రీసెంట్‌గా ఓ సినిమాకు కమిట్‌ అయినట్లు తెలిసింది.

చదవండి: నాకు ఫోన్‌ కొనివ్వడానికి మా నాన్న అప్పు చేశారు: బిగ్‌బాస్‌ నేహా చౌదరి

అంతేకాదు తాప్సీతో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా సంతకం చేసినట్లు సమాచారం. అయితే, ఆమె బాలీవుడ్‌ డెబ్యూ చిత్రంపై రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మొన్నటిదాకా తాప్సీ సినిమాతోనే ఆమె హిందీకి పరిచయం అవుతుందని అనుకున్నారు. ఆ తర్వాత యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌తో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందిన త్వరలోనే అది పట్టాలెక్కనుందని వార్తలు వినిపించాయి. రీసెంట్‌గా ఆమె మరో సినిమాకు సంతకం చేసిందని, ఈ చిత్రమే ముందుగా సెట్స్ పైకి వెళ్లి, విడుదల అవుతుందని తాజా సమాచారం.

చదవండి: ఆస్పత్రి బెడ్‌పై షణ్ముఖ్‌ జశ్వంత్‌, ఫ్యాన్స్‌ ఆందోళన

‘స్త్రీ’ సినిమా ఫేమ్ అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు వైవిధ్య చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా సరసన సమంత హీరోయిన్‌గా  నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది హారర్ చిత్రమని, ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని సమాచారం. ఈ చిత్రం రాజస్థాన్ జానపద కథల ఆధారంగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. చిత్రంలో సమంత రెండు పాత్రలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రాజ్‌పుత్ యువ రాణితో పాటు దెయ్యం పాత్రల్లో అలరించనున్నట్టు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top