Bigg Boss 6 Telugu: నాకు ఫోన్‌ కొనివ్వడానికి మా నాన్న అప్పు చేశారు: నేహా చౌదరి

Bigg Boss 6 Telugu: Neha Chowdary About Her Life And Struggles - Sakshi

బులితెరపై ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో ఇప్పటి వరకు ఈ షో 5 సీజన్లు పూర్తి చేసుకోగా.. తాజాగా ఆరో సీజన్‌లోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్‌ 4న బిగ్‌బాస్‌ 6వ సీజన్‌ గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. ఈ సీజన్‌తో ఆడియన్స్‌కి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు 21 మంది కంటెస్టెంట్స్‌ని రంగంలోకి దింపారు. వారిలో 11 మంది అమ్మాయి ఉన్నారు. అందులో ప్రముఖ యాంకర్‌ నేహా చౌదరి ఒకరు. స్టార్‌ స్పోర్ట్స్‌లో యాంకర్‌గా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆమె ఈ సీజన్‌ కోసం బిగ్‌బాస్‌ ఆఫర్‌ అందుకుంది.

ఈ నేపథ్యంలో హౌజ్‌లో అడుగు పెట్టే ముందు నేహా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తిర విషయాలను బయటపెట్టింది. తనది వ్యవసాయ కుటుంబ నేపథ్యమని, చిన్నతనంలో వారు చాలా కష్టపడ్డట్లు చెప్పింది. తన కెరీర్‌ కోసం వాళ్ల నాన్న ఎకరాలు ఎకరాలు అమ్మేసారంటూ నేహా ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ల నాన్న అప్పు చేసి తనకు ఫోన్‌ కొనిచ్చాడంటూ నేహా వాపోయింది. ఇక అమ్మానాన్న సైడ్‌ బంధువులంతా ఫారెన్‌లో, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో సెటిల్‌ అయితే తాను స్పోర్ట్స్‌ సైడ్‌ వెళ్లానని చెప్పింది. అలా జిమ్నాస్టిక్స్‌కి వెళ్లాను అని తెలిపింది. 

చదవండి: ఆస్పత్రి బెడ్‌పై షణ్ముఖ్‌ జశ్వంత్‌, ఫ్యాన్స్‌ ఆందోళన

‘నేను చాలా చిన్న వయసులోనే చాలా ఫాస్ట్‌గా జిమ్నాస్టిక్స్‌ నేర్చుకున్నా. సీనియర్స్‌తో పోటీ పడేదాన్ని. నా ​కోచ్‌ కూడా ప్రాక్టీస్‌ చేపించేటప్పుడు నా సీనియర్స్‌తో చేపించేవారు. నా సీనియర్‌ ఓ అమ్మాయి నన్ను దారుణంగా ర్యాగింగ్‌ చేసేది. దాన్ని ర్యాగింగ్‌ అనేది చాలా చిన్న మాట అవుతుంది. అంతలా నన్ను ఆమె టార్చర్‌ చేసింది. ఇంకా కొంతమంది నన్ను దారుణంగా ఇబ్బంది పెట్టేవాళ్లు. నేను పడుకుని ఉంటే గట్టిగా గిచ్చి పారిపోయవారు. లేచిచూస్తే ఎవరూ ఉండేవాళ్లు కాదు. అంతలా నా కోర్స్‌ సెంటర్‌లో నన్ను ఇబ్బంది పెట్టారు’ అని చెప్పుకొచ్చింది. ‘ఏదైనా ఈవెంట్‌ కోసం ట్రావెలింగ్‌ చేసేటప్పుడు కూడా నన్ను ఏడిపించేవారు. నాకిప్పటికీ గుర్తుంది.

ఈవెంట్‌ కోసం వేరే ప్రాంతానికి వెళుతుండగా ట్రైన్‌లో పైన పడుకుని ఉంటే.. కిందనుంచి పిన్స్‌తో, పుల్లలతో గుచ్చేవాళ్లు. బాగా ఏడ్చేదాన్ని. ట్రైన్‌లోంచి దూకేద్దామా అన్నంతగా నన్ను ఏడిపించారు. కానీ, నేను ఇది అమ్మావాళ్లకు చెప్పలేకపోయేదాన్ని’ అంటూ ఆమె వాపోయింది. ఈ స్పోర్ట్స్‌ వల్ల తన పేరెంట్స్‌ని ఏమాత్రం ఆనందపెట్టలేకపోయానంది. అందుకే తాను సినీ రంగంలోకి వచ్చానని, కానీ ఇక్కడ కూడా మొదట్లో ఎన్నో రిజెక్షన్స్‌ ఎదుర్కొన్నానని నేహా తెలిపింది.‘ఒకే చానల్‌కి రెండుమూడు సార్లు ఇంటర్య్వూకి వెళ్లాను. వాళ్లు తర్వాత చూద్దామనేవారు. కానీ వారి నుంచి ఎలాంటి ఫోన్‌కాల్‌ వచ్చేది కాదు. రూంకి వెళ్లి చాలా బాధపడేదాన్ని’ అని చెప్పుకొచ్చింది. ఇక తన ఫస్ట్‌ రెమ్యునరేషన్‌ రూ. 500లని ఈ సందర్భంగా ఆమె వెల్లడిచింది. 

చదవండి: ఉత్కంఠభరితంగా ‘పొన్నియన్‌ సెల్వన్‌’ ట్రైలర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top