Samantha is NOT approached for special dance in Allu Arjun's Pushpa-2 - Sakshi
Sakshi News home page

Samantha : పుష్ప-2లో సమంత ఐటం సాంగ్.. క్లారిటీ ఇదే..!

Feb 17 2023 1:14 PM | Updated on Feb 17 2023 1:54 PM

Samantha NOT approached for special Song In Allu Arjun Pushpa  - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో సమంత ఐటం సాంగ్ మరింత హైలెట్‌గా నిలిచింది. 'ఊ అంటావా మావ ఉఊ అంటావా మావా' అంటూ అభిమానులను ఓ ఊపు ఊపేసింది.

అయితే పుష్ప సినిమా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కాగా.. పుష్ప-2లోనూ సమంతతో ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. దీనికోసం ఇటీవల సమంతను చిత్రబృందం సంప్రదించగా ఆమె ఆఫర్ తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. పుష్ప-2లో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ సమంతను సంప్రదించలేదని ఆమె సన్నిహితులు తెలిపారు. 

కాగా.. సమంత ప్రస్తుతం సిటాడెల్, ఖుషి,  శాకుంతలం చిత్రాల్లో కనిపించనున్నారు. ఇటీవలే సిటాడెల్ షెడ్యూల్‌ను సమంత ముంబైలో పూర్తి చేసుకుంద. గుణశేఖర్ దర్శకత్వంలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన శాకుంతలం ఏప్రిల్ 14, 2023న విడుదల కానుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రంలో నటించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement