టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ (Roshan) కొత్త సినిమా ‘ఛాంపియన్’ (Champion). సుమారు నాలుగేళ్ల తర్వాత వెండితెరపైకి తిరిగొస్తున్నాడు. దీంతో తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. డిసెంబరు 25న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై రోషన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
ఛాంపియన్ సినిమాలో అతను ఫుట్‌బాల్ ఆటగాడిగా రాబోతున్నాడు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రలో రోషన్ కనిపించబోతున్నారు . ఈ పాత్ర కోసం ఫిజికల్‌గానూ ట్రాన్్సఫర్మేషన్ అయ్యారని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె. మేయర్ అందించారు.


